Wednesday, November 27, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికృషి ,పట్టుదల ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చు..

కృషి ,పట్టుదల ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చు..

బుచ్చేశ్వరరావు, ఆనంద్
విశాలాంధ్ర ధర్మవరం : కృషి పట్టుదల అకుంఠిత దీక్ష ఉన్నవారు ఎవరైనా సరే జీవితంలో దేనినైనా కూడా సాధిస్తారని లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా కార్యదర్శి బుచ్చేశ్వరరావు, రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు పెద్ది పోగు ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో సకల ఆర్ట్స్ అకాడమీ అండ్ ఎల్ సి ఈ ఎస్ ఫౌండేషన్ ఏపీ వారి జాతీయ నాట్య కళా రత్న పురస్కారాల సభకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం ఎస్బిఐ కాలనీలో గల కూచిపూడి నాట్య గురువుగా ఆర్. మానసకు వారు హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు వారి గౌరవ డాక్టరేట్ ను వారి చేతులమీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గురువు మానస అతి చిన్న వయసులోనే కూచిపూడి నాట్యం నేర్పడం జిల్లాలకు రాష్ట్రాలకు వెళ్లి తన నాట్యాన్ని తోపాటు నేర్పించిన చిన్నారులతో ప్రదర్శన ఇవ్వడం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ బాల బాలికలను చదువుతోపాటు నృత్యమును కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింప చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అనంతరం మానస శిష్యులు నిర్వహించిన నిత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తదుపరి ముఖ్య అతిథులను గురువు మానస, వారి తల్లిదండ్రులు కూడా ఘనంగా సత్కరించారు. ఇటువంటి కార్యక్రమాన్ని ధర్మవరంలో నిర్వహించడం నిజంగా గర్వించదగ్గ విషయమని వారు మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత, సమాజ సేవకులు పవన్ కుమార్, రాఘవ, వడ్డే రాము, దాసరి శ్వేత తో పాటు కూచిపూడి నాట్యం నేర్చుకున్న శిష్యుల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం శిష్య బృందానికి షీల్డ్ ను అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు