Monday, July 21, 2025
Homeతెలంగాణపాశమైలారం పేలుడు ఘటన.. 44కి చేరిన మృతుల సంఖ్య

పాశమైలారం పేలుడు ఘటన.. 44కి చేరిన మృతుల సంఖ్య

మరో 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదని వెల్లడి
శిథిలాల కింద కొనసాగుతున్న గాలింపు చర్యలు
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సంస్థ

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషాదంలో మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కార్మికులు మంగళవారం కన్నుమూశారని అధికారులు వెల్లడించారు.వివరాల్లోకి వెళితే… సంగారెడ్డిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనేసియా మెరిడియన్ ఆసుపత్రిలో చికిత్సలో ఉన్న ఆరిఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఆసుపత్రుల్లో చేరిన వారిలో గత వారం రోజుల్లో ఇప్పటివరకు 8 మంది మరణించారు. ప్రస్తుతం మరో 16 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.జూన్ 30న పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు బృందాలు శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గల్లంతైన తమ వారి కోసం బాధితుల కుటుంబాలు సహాయ కేంద్రం వద్ద ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి.మరోవైపు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రకటించింది. గాయపడిన వారి పూర్తి చికిత్స ఖర్చులను భరించడంతో పాటు వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు