జిల్లా మలేరియా అధికారి-ఓబులు
విశాలాంధ్ర ధర్మవరం:: ఇంటితో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని జిల్లా మలేరియా అధికారి ఓబులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆకస్మికంగా పట్టణంలోని శారద నగర్, తదుపరి మున్సిపల్ ఆఫీస్ వెనుక భాగానగల ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా వారు తనిఖీ చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా రోగాల యొక్క పరిస్థితిని వారు గమనించారు. కంప్యూటర్లో నమోదు చేసిన వాటిని కూడా వారు పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యము, మందులు పంపిణీ చేయాలన్నారు. రోగి పైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేయరాదని తెలిపారు. తదుపరి శారదానగర్లో పలు ఇళ్లల్లో డ్రమ్ము, నీటి తొట్టిలను వారు పరిశీలించారు. నీరు నిల్వ ఉండడం చూచి సిబ్బందితో నీటిని తొలగింపజేశారు. చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉన్న వాటిని పూర్తిగా మీరు తొలగించుకోవాలని అక్కడి ప్రజలకు వారు సూచించారు. ప్రజల నుంచి ఏవైనా జ్వరాలు వచ్చే పరిస్థితి ఉందా? ఇంతకు మునుపు వచ్చిందా? మరి ఏమైనా రోగాలు వచ్చాయా? అన్న వివరాలను నేరుగా ప్రజల వద్ద అడిగి తెలుసుకున్నారు. నీరు నిల్వ ఉన్నచోట దోమలు లార్వా స్థితిలో ఉంటూ గ్రుడ్లు పెడతాయని తెలిపారు. ఈజిప్ట్ అనే ఆడదోమ మనిషికి పుట్టినప్పుడు డెంగ్యూ చికెన్ గునియా అనే వ్యాధులు వస్తాయని తెలిపారు. తదుపరి అక్కడి ప్రజలకు ఈ వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు రాత్రి సమయాలలో దోమతెర కట్టుకోవాలని, వేపాకు పొగ పెట్టాలని, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి జయరాం నాయక్, ఎం పి హెచ్ ఈ ఓ గిరిధర్ రెడ్డి, సూపర్వైజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది
RELATED ARTICLES