Thursday, November 28, 2024
Homeఆంధ్రప్రదేశ్మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. రైతు సంఘం

మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. రైతు సంఘం

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ విమర్శించారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు కాస్తో కూస్తో గిట్టుబాటు ధర ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా నిట్టనిలువ ముంచే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడైనా రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తానని అబద్దపు హామీలు ఇచ్చిందన్నారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 వేలు ఇస్తానని చెప్పి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత రైతులకు ఇంతవరకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక మోడీ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదని వారన్నారు. వెంటనే మిర్చి ధరకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పంట నష్ట పరిహారం కింద మిర్చిని కూడా చేర్చాలని, అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో 1000 మంది పైగా రైతులు ట్రాన్స్ ఫార్మర్లు కోసం డీడీలు చెల్లించినా కూడా ఇంతవరకు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వకుండా కూటమీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డీడీలు చెల్లించిన రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగిలి మారెప్ప, మదరసాబు, రజ్జప్ప, బుడ్డన్న, మహబూబ్, ముక్కన్న, భాష, తదిత రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు