Monday, July 21, 2025
Homeజాతీయంబెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు నోటీసులు ఇచ్చింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ నెల 21న తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీచేసింది. కాగా, ఎంతోమంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మనీలాండరింగ్, హవాలా వంటి తీవ్రమైన ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరుగుతున్న వేళ గూగుల్, మెటా రెండూ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ రెండు కంపెనీలు వెబ్‌సైట్లలో బెటింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలు ప్రదర్శిస్తున్నాయని పేర్కొంది. ఇది అక్రమ కార్యకలాపాల విస్తృతికి దోహదం చేస్తోందని ఆరోపించింది. పలువురు హై ప్రొఫైల్ సెలబ్రిటీలు కూడా ఈ అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు