Monday, July 21, 2025
Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

జూరాల 15 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం 881.60 అడుగులు

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. జూరాల ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తివేశారు. దీంతో, శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 881.60 అడుగులుగా ఉంది. డ్యామ్ నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటిమట్టం 196.561గా ఉంది. వరద ప్రవాహం పెరిగితే ప్రాజెక్టు గేట్లను మళ్లీ ఎత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ వైపు విద్యుత్ కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు