Homeఅంతర్జాతీయంరష్యాలో షాకింగ్ ఘటన..అదృశ్యమైన విమానం..

రష్యాలో షాకింగ్ ఘటన..అదృశ్యమైన విమానం..

- Advertisement -

రష్యాలో అంగారా ఎయిర్‌లైన్స్‌ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది. 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఉన్నట్టుండి ATCతో సంబంధాలు కోల్పోయింది. చైనా బోర్డ‌ర్ స‌మీపంలో అముర్ ప్రాంతంలోని టిండా ప‌ట్ట‌ణం దిశ‌గా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా.. సడన్‌గా ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. విమానం అదృశ్యమవడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. విమానం ఎక్కడ ఉంది, ఇలా జరగడానికి వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు