Homeఆంధ్రప్రదేశ్శ్రీశైల జలాశయం నుండి దిగువ సాగర్‌కు నీరు విడుదల

శ్రీశైల జలాశయం నుండి దిగువ సాగర్‌కు నీరు విడుదల

- Advertisement -


విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ఎగువ క్రిష్ణా పరివాహ ప్రాంతంలో కురుస్తున్న వరదల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతుంది.ఆదివారం జలాశయం నుండి దిగువ సాగర్‌కు ఒక గేటు ఎత్తి 26,744 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఏపీ జలవిద్యుత్‌ ఉత్పత్తికి 30,917క్యూసెక్కులు, తెలంగాణ జలవిద్యుత్‌ ఉత్పత్తికి 35,315 క్యూసెక్కులు, హెఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా 2400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 30,000క్యూసెక్కులు, మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగుల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగాప్రస్తుతం 199.27 టీసీఎంల నీరు నిల్వ ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు