Monday, December 23, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపురపాలక సంఘమునకు చెల్లించవలసిన పనులను వెంటనే చెల్లించండి..

పురపాలక సంఘమునకు చెల్లించవలసిన పనులను వెంటనే చెల్లించండి..

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం : పురపాలక సంఘమునకు చెల్లించవలసిన అన్ని పనులను వెంటనే చెల్లించి మునిసిపల్ ఆదాయ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024-25 సంవత్సరమునకు సంబంధించిన పాత బకాయిలు వసూలు చేయు నిమిత్తం సచివాలయ సిబ్బందితోపాటు కార్యాలయ సిబ్బంది,వార్డుల యందు వసూలు నిమిత్తం తిరుగుతున్నందున, పన్ను చెల్లింపు దారులు, సచివాలయ సిబ్బందికి పురపాలక సంఘ సిబ్బందికి సహకరించి పనులు చెల్లించాలని వారు తెలిపారు. ఆస్తి పన్నులు, నీటి కులాయి పన్నులు, ఖాళీజాగా పన్నులు కట్టి తప్పనిసరిగా రసీదు పొందాలని తెలిపారు. అంతేకాకుండా ఒక సంవత్సరము పైబడి ఉన్న వారి యొక్క నీటి కొళాయి కనెక్షన్, ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా తొలగించడమే కాకుండా, ఏపీ మున్సిపాలిటీ చట్టం ప్రకారం చర్యలు గైకొంటామని తెలిపారు. పన్ను చెల్లింపు దారులు ఆన్లైన్లో కానీ,మున్సిపల్ ఆఫీసు నందు గాని, ఎల్పీ సర్కిల్ నందు గల సచివాలయం వద్ద గాని పార్థసారథి నగర్-2 సచివాలయం వద్ద గాని చెల్లించవచ్చునని తెలిపారు. కావున పట్టణంలోని ప్రజలందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు