బెంగళూరు: అమేజాన్ ఇండియా తమ ప్రారంభోత్సవపు బ్లాక్ ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రకటించింది. నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు ఇది కొనసాగుతుంది. అంతర్జాతీయంగా భారీగా సంబరం చేసుకోబడే, అమేజాన్ ఇండియా వారి మొదటి బ్లాక్ ఫ్రై కార్యక్రమం యాపిల్, శామ్సంగ్, సోనీ, నైక్, కాల్విన్ క్లీన్, ఆడిడాస్, టమ్మీ హిల్ ఫిగర్, పనసోనిక్, జీన్ పాల్, డాబర్, ఎల్జీ, అల్డో, స్వరోవ్స్కి సహా బ్రాండ్స్, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ శ్రేణులపై డీల్స్‌ను అందిస్తోంది. అమేజాన్ వారి ప్రసిద్ధి చెందిన షాపింగ్ కార్యక్రమం బ్లాక్ ఫ్రైడేని మొదటిసారిగా అమెజాన్.ఇన్‌పై భారతదేశంలోకి తీసుకువస్తున్నామని, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, గృహోపకరణాలు, దేశ, విదేశీ బ్రాండ్స్‌కు చెందిన డెకార్‌లో ఆదాలు అందచేస్తున్నామని అమేజాన్ ఇండియా కాటగిరీస్ వైస్-ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాత్సవ అన్నారు. కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి, ఇండస్ ఇండ్, బిఓబి కార్డ్, హెచ్ఎస్బిసి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్స్, క్రెడిట్ ఈఎంఐతో 10% తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు.