హైదరాబాద్: అత్యంత పవిత్రమైన వరమహాలక్ష్మి పండుగ సమీపిస్తున్న తరుణంలో, కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ కొత్త పండుగ కలెక్షన్‌ను పరిచయం చేసింది. అందంగా తీర్చిదిద్దబడిన టెంపుల్ జువెల్లరీ, 92.5 స్వచ్ఛమైన వెండి ఆభరణాలను యాంటిక్ ఫినిష్‌లో విడుదల చేసింది. ఈ కలెక్షన్లో సంప్రదాయం సమకాలీన శైలిని మిళితం చేసుకుంటుంది. దక్షిణ భారత వారసత్వంలో లోతుగా మిళితమైన ఈ కలెక్షన్ లక్ష్మీ ప్రతిరూపాలు, సంక్లిష్టమైన పనితనం కలిగి ఉంది. ఆలయ నిర్మాణశైలి వైభవం నుండి ప్రేరణ పొందింది. ఈ కలెక్షన్‌కు సంబంధించిన ప్రచార చిత్రాలలో నటి ఆషికా రంగనాథ్ కనిపించటంతో పాటుగా ఈ కలెక్షన్ చక్కదనం, వైభవాన్ని అందంగా ప్రదర్శించారు. కుషల్స్ తాజా కలెక్షన్ వైవిధ్యంగా ఉంటూనే ధరించగలిగేలా ఉంటుంది. ఆచారాలను గౌరవించే రీతిలో కుషల్స్ ఆభరణాలను అందిస్తుంది.


