Homeఅంతర్జాతీయంమీరు చేయొచ్చు… ఇతరులు చేయరాదా?

మీరు చేయొచ్చు… ఇతరులు చేయరాదా?

- Advertisement -

రష్యాతో వాణిజ్యంపై అమెరికాకు చైనా ప్రశ్న
బీజింగ్‌: రష్యాతో వాణిజ్య సంబంధాలను సాకుగా చూపుతూ ప్రపంచ దేశాలపై సుంకాలతో అమెరికా విరుచుకుపడుతుండటంపై చైనా మండిపడిరది. మీకో న్యాయం, మిగతా దేశాలకు మరొక న్యాయమా అంటూ నిలదీసింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న అమెరికా… మిగతా దేశాలను తప్పుపట్టడం సమంజసమా అని ప్రశ్నించింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస)లోని బీజింగ్‌ శాశ్వత ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ అమెరికా తీరును ఖండిరచారు. ఐరాస భద్రతా మండలిలో ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై చర్చలో అమెరికా ఆరోపణలను తోసిపుచ్చారు. రష్యాకు ఎలాంటి ఆయుధాలు అందించలేదని తేల్చిచెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌తో సాధారణ వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే ముందుకు వెళుతున్నట్లు వెల్లడిరచారు. తాము ఎక్కడ కూడా చట్టాలను ఉల్లంఘించలేదని అన్నారు. రష్యాతో అమెరికా వాణిజ్యం కొనసాగించిందని, ఆ దేశంతో ఇతరులు వాణిజ్యం చేయకూడదంటూ హెచ్చరిస్తోందని షువాంగ్‌ అన్నారు. అమెరికా చేస్తే ఒప్పు, మిగతా దేశాలు చేస్తే తప్పా అంటూ అసహనం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌లో సంక్షోభం పరిష్కారానికి ఇదే సమయమని, కాల్పుల విరమణ, శాంతి నెలకొల్పడంపై దృష్టి పెట్టాలని షువాంగ్‌ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు