Sunday, December 22, 2024
Homeజిల్లాలుఅనంతపురంభారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఆర్ బి ఐ డిజిటల్ కరెన్సీ వ్యవస్థ

భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఆర్ బి ఐ డిజిటల్ కరెన్సీ వ్యవస్థ

విశాలాంధ్ర అనంతపురం : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.ఎ.కోరి జాతీయ సెమినార్‌ను ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీలో అకడమిక్ డెవలప్‌మెంట్‌లను ప్రదర్శనల జాతీయ సెమినార్‌ను శనివారం ప్రారంభించారు.
హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ దేబాశిష్ ఆచార్య భారతదేశ ఆర్థికాభివృద్ధి కోసం ఆర్ బి ఐ ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ ఎకోసిస్టమ్‌పై సంప్రదాయ నగదు చెల్లింపుల కంటే డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాల గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సులోని కీలకోపన్యాసంలో ప్రస్తావించారు. ఈ సదస్సులో
ప్రొఫెసర్. జి. రామ్ రెడ్డి, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్, ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్, మాజీ వైస్ ఛాన్సలర్, ఎస్.వి యూనివర్సిటీ, డాక్టర్ ఎన్ శ్రీ దేవి, మాజీ రిజిస్ట్రార్, సి ఈ ఎస్ ఎస్ , హైదరాబాదు తదితర ప్రముఖులు జాతీయ సెమినార్‌కు హాజరయ్యారు.
ఈ రెండు రోజుల జాతీయ సెమినార్‌కు డాక్టర్ వై.కేశవరెడ్డి కన్వీనర్ గా వ్యవహరించి పాల్గొనే వారందరికీ ఆహ్వానం పలకగా జాతీయ సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బ్రజరాజా మిశ్రా కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు