Homeజిల్లాలుశ్రీ సత్యసాయికరాటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వలన ఉద్యోగ అవకాశాలు

కరాటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వలన ఉద్యోగ అవకాశాలు

- Advertisement -

: హెడ్మాస్టర్ సుమన
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని గడ్డం వెంకటమ్మ యాతిరాజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఈనెల 17వ తేదీ ప్రకాశం జిల్లా ఒంగోలు పార్వతి రెడ్డి ఆనంద్ మినీ ఫంక్షన్ హాల్ లో 43వ యానివర్సరీ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని 10 గోల్డ్ మోడల్స్, 2 సిల్వర్ మోడల్స్, 8 బ్రాంచ్ మోడల్స్ సాధించిన ధర్మవరం మల్టీ స్టార్ బోడోకన్ కరాటే అకాడమీ కరాటే మాస్టర్స్ ఇనయత్ భాష, నవ్య శ్రీ, విద్యార్థులు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి విద్యార్థులను టిడిపి పట్టణ అధ్యక్షులు పరిసి సుధాకర్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా క్రీడారంగంలో మెడల్స్ సాధించిన విద్యార్థులకు 5000 రూపాయల బహుమతులు కూడా వారు అందజేశారు.గడ్డం వెంకటమ్మ యాతిరాజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ వై.సుమన మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థి పి. సింధు అనే విద్యార్థి కరాటే లో గోల్డ్ మోడల్ సాధించినందుకు ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం తరపున అభినందిస్తున్నాము అని తెలిపారు. ఇలాంటి మెడల్స్ ను ఈ విద్యార్థిని మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని తెలిపారు. ఈ కరాటే అనేది మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వలన విద్యార్థులలో ఆత్మశైర్యం పెరుగుతుంది అని, తద్వారా వారి ఆత్మ రక్షణ కూడా చాలా ఉపయోగపడుతుంది అని తెలిపారు. నేటి సమాజంలో ఇలాంటి ఆత్మ రక్షణ చర్యలు అనేటివి చాలా అవసరం కాబట్టి, ఇలాంటి విద్యార్థినిని చూసి మిగతా విద్యార్థినిలు కూడా పాఠశాలలో కరాటే నేర్చుకోవాలని ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. మా పాఠశాల తరఫున విద్యార్థులందరికీ కరాటే శిక్షణ ఇప్పించి వారి భవిష్యత్తుకు తోడ్పడే విధంగా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు ఇనయత్ భాష, జి నవ్య శ్రీ, విద్యార్థిని తల్లిదండ్రులు వి. వీరయ్య, వి. వెంకటలక్ష్మి, కె.చంద్రాయుడు, కె .రమణమ్మ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు