విశాలాంధ్ర – కడియం : మామిడిపళ్ళ సీజన్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది వేసవికాలం. వేసవిలో మామిడి తీపి రుచులను పంచుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏడాది పొడుగునా మామిడి రుచులను ఆస్వాదించవచ్చు. కాలం కాని కాలంలో కూడా మామిడి కాయలు లభ్యమయ్యేలా వివిధ మామిడి రకాలు అందుబాటులోకొచ్చాయి. ఆగస్టు నెలలో మామిడి చెట్లకు కాయలు ఉంటే ఆశ్చర్యపోక తప్పదు. కడియం మండలం, కడియపులంక గ్రామానికి చెందిన రైతు ఈలి గోపాలరావు వ్యవసాయ క్షేత్రంలో థాయిలాండ్ పునాస మామిడి, గుత్తులు గుత్తులుగా కాస్తూ చూపరులను ఆకర్షిస్తుంది. ఈ రకం మామిడి సంవత్సరానికి మూడు కాపులుగా కాస్తుందని, కాయ గుండ్రంగా ఆకర్షణీయంగా ఉంటుందని, తెలుగు రాష్ట్రాలలో ఈ మొక్కలు పెంచడానికి వాతావరణం అనువుగా ఉంటుందని వ్యవసాయ మండలి మాజీ చైర్మన్ ఈలి గోపాలరావు తెలిపారు.
ఆగస్టు నెలలో మామిడికాయలు ఆశ్చర్యమే
- Advertisement -
RELATED ARTICLES


