ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం : ప్రజల సమస్యలను పరిష్కరించుటలో ప్రభుత్వ ఉద్యోగులు చిత్తశుద్ధితో ఉన్నప్పుడే, ప్రజల వద్ద అధికారుల వద్ద మంచి గుర్తింపు లభిస్తుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఉప తహసిల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న అంపయ్య పదవి విరమణ చేసిన సందర్భంగా, ఆర్డీవో ఛాంబర్ కార్యాలయంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, పదవి విరమణ చేసినప్పుడు తన సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో అన్న ఆలోచనతో సంతృప్తిగా, సంతోషంగా వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా అంపయ్య తన తోటి కార్యాలయ సిబ్బంది, అధికారులతో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయము నందు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వద్ద కూడా తన సర్వీసులో ఎప్పుడూ ఎటువంటి ఫిర్యాదులు లేవని చక్కటి సేవలు అందించడం జరిగిందన్న సమాచారం అతని సేవలకు గుర్తింపు అని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ధర్మారం రెవెన్యూ డివిజన్ లోని ప్రజలకు ఆయా మండల అధికారుల ద్వారా సకాలంలో అందే విధంగా విశేష కృషి చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. వారు పదవీ విరమణ పొందడం బాధాకరమైన, తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుందని తెలిపారు. వారి సలహా, సూచనలు, సహాయ సహకారాలు ఆర్డిఓ కార్యాలయానికి ఎల్లప్పుడూ ఉండాలని వారు కోరారు. అనంతరం డి ఏ ఓ కతిజ్జున్ కుప్రా తదితర అధికారులు సిబ్బంది మాట్లాడుతూ అంపయ్య సేవలు మరుపురానివని, తన డ్యూటీ మాత్రమే చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆర్ డి ఓ తో పాటు కార్యాలయ సిబ్బంది, డివిజన్ పరిధిలోని తహసిల్దార్లు, ఇతర అధికారులు కలసి అంపయ్యను సతీసమేతంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించుటలో ప్రభుత్వ ఉద్యోగులు చిత్తశుద్ధితో ఉండాలి..
RELATED ARTICLES