విశాలాంధ్ర -అనంతపురం : బీసీ కార్పొరేషన్ నిధులు పై ఈడీ సుబ్రహ్మణ్యం ని మంగళవారం బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ కలిశారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ… అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించి వెనకబడిన వర్గాలకు చేతివృత్తిదారులకు ఈ పేద కుటుంబాలకు నిధులు నిధులు వచ్చాయని బీసీ కార్పొరేషన్ ఈడీని అడగడం జరిగిందన్నారు. ఈడి మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబోతున్నాయి అని వస్తే మీకు వెంటనే తెలియజేస్తామన్నారు. నిధులు వచ్చిన వెంటనే రజక నాయి బ్రాహ్మ గొర్లు మేకల పెంపకదారులకు మేదర్లకు కుమ్మర్లకు చేనేత కార్మికులకు వడ్డెర్లకు స్వర్ణకారులకు గీత కార్మికులకు అణగారిన వర్గాలకు నిధులు ఇచ్చి ఆదుకోవాలని డి జగదీష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య పాల్గొన్నారు.