జిల్లా ఎస్పీ పి. జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-44పై బ్లాక్ స్పాట్స్ ను జిల్లా ఎస్పీపి.జగదీష్ ఎన్ హెచ్ ఏ ఐ , ఆర్టీఏ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. బ్లాక్ స్పాట్ ప్రాంతాలైన రాప్తాడు జంక్షన్, అయ్యవారిపల్లి క్రాస్, కక్కలపల్లి క్రాస్, తపోవనం కూడళి, శిల్పారామం సమీపంలోని బ్రిడ్జి, నారాయణ కళాశాల కూడళ్లలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో అప్పుడప్పుడు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలను సమీక్షించారు. అంతేకాకుండా… జాతీయ రహదారిపై డ్రోన్లు ఆపరేట్ చేసి ప్రమాదాలకు కారణాలపై జిల్లా ఎస్పీ చూపించారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలంటే ఎలాంటి పరిష్కారాలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో పలు సూచనలు చేశారు. అయ్యవారిపల్లి క్రాస్ వద్ద సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని… అయ్యవారిపల్లి క్రాస్ నుండీ రాప్తాడు వరకు హైవేపై ఉన్న మీడియన్స్ క్లోజ్ చేసి వాటి స్థానాన ఐరన్ బ్యారికేడింగ్ చేయాలని సూచించారు. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు హైవేపై రోడ్డు దాటకుండా వీలుంటుందన్నారు. తపోవనం కూడళి వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, క్యాట్ ఐ స్, లైటింగ్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ గారితో పాటు డి.టి.సి వీరరాజు, అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేశులు, సి.ఐ లు వెంకటేష్ నాయక్, శ్రీహర్ష, శేఖర్, రఘుప్రసాద్, తదితరులు వెళ్లారు.