Wednesday, December 4, 2024
Homeజిల్లాలుకర్నూలుప్రతిభను వైకల్యం అడ్డుకోలేదు…

ప్రతిభను వైకల్యం అడ్డుకోలేదు…

ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ప్రతిభ గల వారికి వైకల్యం ఏమాత్రం అడ్డు కాదని, ప్రతిభావంతులైన వారిని గుర్తించి అన్ని విధాలా ప్రోత్సహించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐ మస్తాన్ వలి, ఎంపీపీ సుంకర ఉమాదేవి భర్త రామాంజనేయులు, ఎంఈఓ-2 తిరుమలరావు, వెలుగు ఏపీఎం జనార్ధన్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సేక్రెడ్ సంస్థ, ఆదర్శ వికలాంగుల మండల సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సేక్రెడ్ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్, బస్టాండ్ మీదుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వీరేంద్ర, ఎల్లప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వికలాంగులను అడ్డు పేర్లుతో పిలిచిన దూషించిన నేరమని 2016 హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 91,92 ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, సంఘాలుగా ఏర్పడిన గ్రూపులకు బ్యాంకు లింకేజెస్ మరియు శ్రీనిధిలో రుణాలు మంజూరు చేస్తామన్నారు. విభిన్నప్రతిభావంతులను ప్రోత్సహించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేక్రెడ్ సంస్థ సిబ్బంది వీరశేఖర్, ఆదర్శ వికలాంగుల సమైక్య సభ్యులు వీరేష్, లక్ష్మన్న, నాగలక్ష్మి, రంగస్వామి, చిన్నస్వామి, విజయమ్మ, ఎర్రమ్మ, హనుమంతు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు