విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురంలోని లలిత కళాపరిషత్ లో రంగస్థలం సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళా నికేతన్ వ్యవస్థాపకులు, డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ చేస్తున్న కూచిపూడి విభాగంలో ఎన్నో సేవలను చేశారు. ఈ సందర్భంగా బాబు బాలాజీ వారి చేస్తున్న సేవలను పురస్కరించుకొని కార్యనిర్వాహకులు పెద్ద ప్రోగు ఆనంద్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అధినేత నాగేంద్ర గౌడ్ చేతుల మీదుగా నృత్య కళా రత్న అవార్డుతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం బాబు బాలాజీ మాట్లాడుతూ నాట్యం అనేది నాకు దేవుడు ఇచ్చిన వరము అని తెలిపారు. ఆ నాట్యాన్ని పదిమందికి నేర్పించడం, నాకు తృప్తి, సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. నన్ను ఈ పరంగా అవార్డుతో సన్మానించడం మరుపురాని రోజు అని వారు తెలిపారు.
నృత్య కళారత్న అవార్డును కైవసం చేసుకున్న డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ
- Advertisement -
RELATED ARTICLES


