Thursday, December 19, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపిల్లల యొక్క దృష్టి లోపాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి

పిల్లల యొక్క దృష్టి లోపాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి

కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: పిల్లలు యొక్క దృష్టి లోపాల్ని తల్లిదండ్రులు గుర్తించినప్పుడే కంటి వెలుగు సంపూర్ణంగా ఉంటుందని కంటి వైద్య నిపుణులు, రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమిష్టిగా విద్యార్థులలోని దృష్టిలోపాన్ని గుర్తించి కంటి డాక్టర్ సలహాతో సరియైన కంటి అర్థాలను ఉపయోగిస్తే వారిలోని దృష్టిలోపాలను పరిష్కరించవచ్చునని తెలిపారు. కంటి రక్షణపై నిర్లక్ష్యం ఉండరాదని తెలిపారు. విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే చక్కటి కంటిచూపు ఎంతైనా అవసరమని తెలిపారు. చాలామంది కుటుంబంలోని పిల్లలు తమ కంటి చూపును సమస్యను చెప్పకుండా బాధపడుతుంటారని, తల్లిదండ్రులు కంటి విషయంపై జాగ్రత్త వహిస్తే సమస్యలు ఉండవని తెలిపారు. పిల్లలను టీవీ తో పాటు సెల్ఫోన్ కు దూరంగా ఉంచాలని తెలిపారు. ఎందుకంటే పరోక్షంగా చదువులో కూడా వెనుకబడే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి పాఠశాలలో కంటిచూపు పట్టికను ఏర్పాటు చేస్తే విద్యార్థులే స్వయంగా దృష్టిలోపాలను కనుగొంటారని తెలిపారు. ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంతైనా ఉంది అని తెలిపారు. కంటి చూపు పట్టికను బాగా వెలుతురు ఉన్న గదిలో సమాన ఎత్తులో తగిలించాలి, తదుపరి విద్యార్థులకు ఆరు మీటర్ల దూరంలో కూర్చొని అక్షరాలను చదివించే ప్రయత్నం చేసినప్పుడు లోపములను సులభతరిలో నిర్ణయించవచ్చునని తెలిపారు. కావున విద్యార్థుల యొక్క కంటి చూపు విషయంలో పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేసినప్పుడే ప్రతి విద్యార్థికి కంటి చూపు లభిస్తుందని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కావున తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు గమనించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు