Thursday, December 19, 2024
Homeజిల్లాలుఅనంతపురంఈద్గా మసీద్ కాంప్లెక్స్ లో అద్దెకు ఉంటున్న వారికి న్యాయం చేయాలి

ఈద్గా మసీద్ కాంప్లెక్స్ లో అద్దెకు ఉంటున్న వారికి న్యాయం చేయాలి

రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అధికారిణి విజయలక్ష్మి కి ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఎస్. పి. ఖాజా హుస్సేన్ వినతులు

విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం సప్తగిరి సర్కిల్ లో ఉన్నటువంటి ఈద్గాహ్ మసీదు కాంప్లెక్స్ షాపు యజమానులకు న్యాయం చేయాలని ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఎస్. పి ఖాజా హుస్సేన్ గురువారం రెవెన్యూ పరిపాలన అధికారిణి విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్ హెచ్ ఏ రోడ్ వైడెనింగ్ లో భాగంగా ఈద్గా మసీద్ కొంతమేర తొలగించాలన్న విషయం అందరికి విధితమే అన్నారు. అనంతపురం అభివృద్ధి కి మేము ఏ విధంగాను విరుద్ధము కాదన్నారు. గత మంగళవారం త్రిసభ్య కమిటీ వారు మసీదు వద్దకు చేరుకున్నపుడు అప్పటికే ఉదయం 10 గంటల నుండి సంబంధిత అధికారులతో మాట్లాడటానికి ముస్లిం సంఘాలు,రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం నాయకులు, కాంప్లెక్స్ లో అద్దెకు ఉంటున్న వారు, ఇమాములు, హాఫిజ్ లకు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెలియ పరచటం వలన అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని సంబంధిత అధికారులతో చర్చిద్దామని వేచి చూశారన్నారు. అధికారులు వచ్చీ రాగానే వారెవ్వరితోనూ చర్చ జరపకుండా కేవలం ఒకరిద్దరి అభిప్రాయం తెలుసుకుని అదే ఖాయమని అనుకుని వెళ్ళిపోవటం పారదర్శకతకు నిదర్శనం కాదన్నారు. దీని వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయం ఆర్.డి.ఓ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సంఘాలు, కాంప్లెక్స్ లో అద్దెకు ఉంటున్న వారు , వివిధ పార్టీల ముస్లిం నాయకులకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, తగు నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని సరైన మార్గం లో ఈద్గా మసీదు కాంప్లెక్స్ విషయం విహితంగా, పారదర్శకంగా తీరుస్తారని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ నగర గౌరవ అధ్యక్షులు కె.అల్లిపిర, అధ్యక్షులు కె.చాంద్ భాష,రహంతుల్లా, హాజీవలి, దాదు,ఖాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు