విశాలాంధ్ర పెనుకొండ… పెనుకొండ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 1985 -86 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం నందు జరిగింది. ఈ సందర్భంగా పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను పూర్వపు విద్యార్థులు ఘనంగా సన్మానించారు, పాత స్నేహాలను గుర్తుచేసుకొని ప్రస్తుతం వారు స్థిరపడిన విధానము, భార్య పిల్లలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల గురించి మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పదవ తరగతిలో వ్యవహరించిన తీరుల గురించి పాత గుర్తులు నెమరు వేసుకొని ఆనందంగా గడిపారు. చదువుకున్న పాఠశాలకు గుర్తుగా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయులు రాఘవయ్యను పిలిచి పాఠశాలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
పూర్వపు విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
- Advertisement -
RELATED ARTICLES


