అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 180 గజాలు మంజూరు…
ఎమ్మెల్యే బడేటి చంటి….
విశాలాంధ్ర -ఏలూరు: నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పిలుపునిచ్చారు.శుక్రవారం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో , అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు జాలా బాలాజీ పర్యవేక్షణలో స్థానిక నవాబ్ పేట వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి చంటి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ సామాజిక వ్యవస్థ ఆధారంగా నిరుపమాన అధ్యయనంతో జాతీయ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబంబించే రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆలోచనలు ఉన్నతమైనవి అన్నారు.మానవ,అంతరాలు లేని కోసం,దోపిడీ పీడనలు లేని వ్యవస్థ నిర్మాణం ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు, సమాజ హితమైనవి అన్నారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం మన అందరి బాధ్యత ఆయన జీవిత చరిత్ర కూడా రాజ్యాంగ బద్ధమైనదే అందుకే అన్ని పార్టీల వారు ఏకకంఠంతో అంబేద్కర్ దూరమై ఆరు దశాబ్దాలు దాటినా మనం జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దశాబ్దాల కాలంగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలం 180 గజాలను అశేష అంబేద్కర్ అభిమానులు, నాయకుల హర్షద్వానాల మధ్య అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్.సి. కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, జాలా సుమతీ బాలాజీ,స్థానిక కార్పొరేటర్
బొద్దాని అఖిలప్రియ,టిడిపి మూడవ డివిజన్ అధ్యక్షులు
చనపతి వెంకటరమణ,రుప్పా రాంబాబు,దాలి త్రిమూర్తులు,శంకర్రావు,యు.రూపేష్,ఎస్.కె. మున్ని,వీరా బత్తిన అనిత, యేసు,జ్వాల అనురాధ,టి మణి,తేలు వెంకట సాయి, నాని,వీరా బత్తిన రాజేష్, ప్రకాష్ యూత్, టిడిపి నాయకులు,దళిత నాయకులు పాల్గొని నివాళులర్పించారు.