Thursday, December 19, 2024
Homeజిల్లాలుఏలూరువైభవంగా ప్రారంభమైన షష్టి మహోత్సవాలు

వైభవంగా ప్రారంభమైన షష్టి మహోత్సవాలు

విశాలాంధ్ర, ముదినేపల్లి : ముదినేపల్లి మండలం సింగరాయపాలెం-చేవూరుపాలెం సెంటర్లో వేంచేసి యున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవాలు స్వామివారిని పెండ్లి కుమారుడు చేయుటతో ప్రారంభమయ్యాయి. ఈ షష్టి ఉత్సవాలు ఈనెల 18 వరకు కొనసాగనున్నాయి. ఈ తెల్లవారుజామున ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ , ప్రముఖులు శ్రీ స్వామివారి పుట్టలో పాలు పోయడంతో ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో 6న శ్రీస్వామి వారిని అమ్మవార్లను పెండ్లి కుమారుడు , కుమార్తెను చేయుట , విగ్నేశ్వరపూజ , పుణ్యాహవాచన , పంచగవ్యప్రాసన , అంకురారోపణ , అగ్నిప్రతిష్టాపన , ద్వజారోహణ , నిత్వౌపాసన , బలిహరణ. 7న శ్రీస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము. 9న కళ్యాణ రథయాత్ర. 10న పుష్కరిణిలో శ్రీస్వామి వార్ల తెప్పోత్సవము. 11న శ్రీస్వామివారికి ,మహాన్యస పూర్వక ఏకాదశి మహా రుద్రాభిషేకము , సహస్త్ర లింగార్చన , లక్షబిల్వార్చన , సాయంత్రం సహస్త్ర దీపాలంకరణ. 12న అష్టోత్తర శతకలశార్చన అభిషేకము. 13న సుబ్రహ్మణ్య హవనం. 15న ద్వజావరోహణ , ద్వాదశ ప్రదక్షణలు , శ్రీస్వామివార్ల పుష్పయ్యాలంకృత పర్యంకసేవ. 18న అన్నదాన మహా యజ్ఞ అన్నసమారాధన. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్యం , వైద్యం , క్యూ లైన్ల బారికెట్లు ఏర్పాటు చేసి శ్రీస్వామివారి దర్శనం శీఘ్రముగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయసహాయ కమిషనర్ రుద్రరాజు గంగా శ్రీదేవి తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా బొంగు రవికుమార్ , వెనిగళ్ళ సురేష్ , నీలం శివరమేష్ , పరసా కృష్ణ , బురుబోయిన సోవమ్మ , కొట్టి సుబ్బలక్ష్మి , దగాని నాగలక్ష్మి , బెజవాడ నాగ వెంకటరాధాకృష్ణ , పరసా రమేష్ లను దేవాదాయ శాఖ నియమించినట్లు రుద్రరాజు గంగాశ్రీదేవి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు