156 మందితో ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన ఎస్పీ సతీష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో 1506 మంది పోలీస్ సిబ్బందితో ఎస్పీ సతీష్ కుమార్ కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటిని సోదా నిర్వహించారు. రౌడీ షీటర్ ఇంటికి వెళ్లి సత్ప్రవర్తనతో నడిపించడానికి కుటుంబీకులు బాధ్యత స్వీకరించాలని తెలిపారు. అదేవిధంగా తుపాకీలు కలిగి ఉన్నారని సమాచారంతో ప్రతి ఇంటిని సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 85 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రౌడీ షీటర్లు ఉన్న ప్రతి ఏరియాలో ప్రతి రోజు శోదా లు నిర్వహిస్తామని తెలిపారు. ఇద్దరు డిఎస్పీలు , 6మంది సీఐలు, 10మంది ఎస్సైలు పోలీస్ సిబ్బంది మొత్తం 156, మందితో ధర్మవరంలోని ఇందిరమ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు.
నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు కాలనీలో గ్రామసభ నిర్వహించి ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించారు. శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించమన్నారు. 16 బృందాలు ఏర్పాటు చేసి, రెండు డ్రోన్ కెమెరాలు, బాడీ వన్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ చెక్ డివైసెస్ వినియోగించడం జరిగిందన్నారు.
మొబైల్ స్కానింగ్ ఫింగర్ ప్రింట్ డివైసెస్ వినియోగించి పాత నేరస్తుల డేటాను సేకరించడం జరిగిందన్నారు. 6మంది రౌడీ షీటర్లు, 8మంది సస్పెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి పరిశీలించమన్నారు. 25 ఏళ్ల క్రితం నేరాలు చేసిన వారు కూడా ఈ కాలనీలో ఉన్నారు కాబట్టి వారిని కూడా కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించామన్నారు. గత 15 ఏళ్ల నుంచి ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వారిపై ఉన్న రౌడీ షీట్లను తొలగించడం జరుగుతుందని, నేరాలలో చురుగ్గా ప్రవర్తిస్తున్న వారు, అంటే రాత్రి సమయాల్లో తాగి గొడవలు, అల్లర్లు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీషీట్లు తెరవడం జరుగుతుందన్నారు.
సరైన రికార్డులు చూపని వాహనాలను 102 సిఆర్పిసి ద్వారా కేసు నమోదు నమోదు చేయడం జరుగుతుందని, వారు కోర్టులో రికార్డులు చూపి విడుదల చేసుకోవలసి వస్తుందన్నారు.
దొంగతనాలు, గొడవలు, అల్లర్లు వంటి నేరాలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలలో వచ్చే చేస్తున్నారు కాబట్టి చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో డ్రంక్ అండ్ డ్రై పై కూడా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ఇందిరమ్మ కాలనీలో 4 సీసీ కెమెరాలు ప్రస్తుతానికి ఉన్నాయని, మరో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల విధులకు, ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రతి ఏరియాలో ప్రతిరోజు ఈ సోదాలు కొనసాగుతాయన్నారు.
రౌడీయిజం చేసే నిందితుల కుటుంబీకులు కూడా వారిపై నిఘా ఉంచాలని, వారిని సత్ప్రవర్తన మార్గంలో నడిపించడానికి వారు కూడా బాధ్యత తీసుకోవాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు. రౌడీయిజం చేస్తున్న ప్రతి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, ధర్మవరం పెనుగొండ డిఎస్పీలు హేమంత్ కుమార్ ,నర్సింగప్ప, సిఐలు రెడ్డప్ప, నాగేంద్రప్రసాద్, ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల విధులకు.. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని…ఎస్పీ హెచ్చరిక
- Advertisement -
RELATED ARTICLES


