Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లావిద్యార్ధులకు ఆయుధాలపై అవగాహన

విద్యార్ధులకు ఆయుధాలపై అవగాహన

- Advertisement -

విశాలాంధ్ర`విజయవాడ (క్రైం): పోలీసుల అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల విధులు, ఎదురయ్యే సవాళ్లు, సాంకేతిక పరిజ్ఞానం, తుపాకుల్లో రకాలు, వినియోగం, ఆయుధాల పనితీరు గురించి విద్యార్ధులకు సీఐ లక్ష్మీ నారాయణ వివరించారు. అల్లర్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. పోలీస్‌ విధుల గురించి పుస్తకాల్లో చదువుకోవడమే ఇప్పటివరకు తెలిసిన ఆ విద్యార్ధులు స్వయంగా ఆయా యంత్రాలను చూసి తీక్షణగా పరిశీలించడం మంచి అనుభవంగా భావించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు షబ్బీర్‌, సౌజన్య, ట్రైనింగ్‌ ఎస్‌ఐలు కరీముల్లా, జగదీష్‌, రేవతి, సిదార్ధ హైస్కూల్‌ విద్యార్ధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు