Saturday, December 21, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదంతాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..

దంతాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..

దంత వైద్యులు వివేక్, విక్రమ్
విశాలాంధ్ర- ధర్మవరం : దంతాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని దంత వైద్యులు వివేక్, విక్రమ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల డాక్టర్ కుళ్లాయప్ప గారి ఆషా హాస్పిటల్ లో దంతముల కొరకు “ఉచిత దంత వైద్య శిబిరమును” నిర్వహించారు. ఆషా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం దంత వైద్యులు వివేక్ ,విక్రమ్ మాట్లాడుతూ విద్యార్థులకు కూడా ఉచిత దంత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ప్రతి ఆదివారం ఈ ఉచిత క్యాంపు నిర్వహించబడుతుందని తెలిపారు, విద్యార్థులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు వెంట తీసుకొని రావాలని తెలిపారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ దంత వైద్య పరీక్షలను నిర్వహించడంతోపాటు, దంతాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 30 మందికి దంత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం ఉచిత చర్మ వైద్య శిబిరము కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రత్యేక చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ నీరజ చే వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కుళ్లాయప్ప, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు