Thursday, December 12, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానం రెండు జీవితాలలో వెలుగు నింపుతుంది….

నేత్రదానం రెండు జీవితాలలో వెలుగు నింపుతుంది….

రోటరీ క్లబ్ జిల్లా అధికారి నరేందర్ రెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానం రెండు జీవితాలలో వెలుగు నింపుతుందని రోటరీ క్లబ్ జిల్లా అధికారి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానం చేసి, అందత్వాన్ని నివారించాలని, అప్పుడే కంటి చూపు లేని వారికి కంటి వెలుగు రావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వ్యక్తి రక్త దానం ,నేత్రదానమును అలవర్చుకోవాలని తెలిపారు. అదేవిధంగా కంటిపట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సొంత వైద్యం కంటికి ప్రమాదం అవుతుందని తెలిపారు. ఇప్పటికే మా రోటరీ క్లబ్ ద్వారా ప్రతినెల నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం వేలాదిమందికి కంటి చూపును ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేత్రదానంపై, కంటి పట్ల భద్రతపై, రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని తెలిపారు. అప్పుడే మానవతా విలువలు పెరిగి, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. పుట్టినప్పుడు ఎలా వస్తామో, మరణించినప్పుడు కూడా అలాగే వెలుతామని తెలిపారు. మానవసేవే మాధవసేవ అని పెద్దలు అన్నారని, మనము పేదల పట్ల అభిమానం, ఆప్యాయత, గౌరవంతో పాటు వారిని తమకున్న స్తోమత లో ఆదుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలో మా రోటరీ క్లబ్ మంచి గుర్తింపు రావడం మాకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. దాతల సహాయ సహకారంతో శిబిరాలను నిర్వహించడం మాకెంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. కాబట్టి నేత్రదానం విషయంలో అందరూ కూడా మంచి హృదయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు