గురు స్వామి- విజయ్ కుమార్
విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ అయ్యప్ప స్వామి భజన మందిరములో ఈనెల 11వ తేదీ అయ్యప్ప స్వామి వారి లక్షణ గ్రామోత్సవ ఉత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు గురుస్వామి పిజే.విజయ్ కుమార్ తెలిపారు. తదుపరి 12వ తేదీ గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు భజన మందిరం నుండి గంధం అలంకరణముతో అయ్యప్ప స్వామిని ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని తిలకించుటకు పట్టణ ప్రజలు, మహిళలు, అయ్యప్ప స్వామి మాల ధారణ భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
అయ్యప్ప స్వామి వారి లక్షార్చన, గ్రామోత్సవ ఉత్సవ వేడుకలు
RELATED ARTICLES