Thursday, December 12, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివివేకానంద డిగ్రీ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు

వివేకానంద డిగ్రీ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్టు కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్టూడెంట్ కౌన్సిలర్ ఎలీషా మాట్లాడుతూ నేటి తరం తన విద్యార్థి దశలో అవసరమైన విషయాలకు మించి అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తును పట్టించుకోకుండా పతనం వైపు నడిపించేలా చేసుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు కాలక్షేపాన్ని ఎక్కువగా కోరుకుంటూ ముందున్న కురుక్షేత్రాన్ని మరిచిపోతున్నారని, వారు ఎటువంటి మాయలో పడకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేరీ ఇందుమతి బృందం, కళాశాల ఏవో రమేష్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు