విశాలాంధ్ర : సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ఈనెల 11, 12 తోపాటు ఈనెల 16, 17(4 రోజులపాటు) స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణా తరగతులను మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు సర్పంచులకు,పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి, మండల స్థాయి అధికారులకు బ్యాచులుగా రెండు రోజులు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మొదటి బ్యాచ్ గా 11 వ తేదీ, 12వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఉంటుందని, ఈ శిక్షణ తరగతులకు మండల సాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్ 1 నుండి 5 వరకు డిజిటల్ అసిస్టెంట్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొనాలని తెలిపారు. తదుపరి రెండవ బ్యాచ్ ఈనెల 16వ తేదీ 17వ తేదీన ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఉంటుందని, ఈ శిక్షణా తరగతులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అగ్రికల్చర్/హార్టికల్చర్/సెరికల్చర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులు, సర్వే అసిస్టెంట్లు, ఎనర్జీ అసిస్టెంట్లు, వీఆర్వోలు పాల్గొనాలని తెలిపారు. శిక్షణా తరగతులకు హాజరపు సభ్యులందరూ ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ లింకు ఉన్న మొబైల్ వెంట తీసుకొని రావాలని తెలిపారు. శిక్షణకు హాజరగు సభ్యులందరికీ భోజన వసతి కల్పించబడును అని తెలిపారు. కావున ఈ శిక్షణా తరగతులకు అందరూ తప్పక హాజరుకావాలని తెలిపారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణా తరగతులు. ఎంపీడీవో.. సాయి మనోహర్
RELATED ARTICLES