Homeజిల్లాలుఅనంతపురంరోడ్డు ప్రమాదంలో మహిళ కూలీలకు గాయాలు..

రోడ్డు ప్రమాదంలో మహిళ కూలీలకు గాయాలు..

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామ సమీపంలో మంగళవారం కూలీలతో వెళుతున్న ఆటోను కారుఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది మహిళా వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. ఉరవకొండ పట్టణానికి చెందిన మహిళ కూలీలు ఆటోలో మూలగిరి పల్లి గ్రామంలో వ్యవసాయ పనులకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడిన వారిని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్య కోసం అనంతపురం తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు