Homeఆంధ్రప్రదేశ్మానవత్వం చాటుకున్న

మానవత్వం చాటుకున్న

- Advertisement -

మానవత్వం చాటుకున్న టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడల విష్ణు చక్రవర్తి.

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంక గ్రామానికి చెందిన టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అభాగ్యులకు తోడుగా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. సంపాదనలో కొంత శాతం వెచ్చించి సేవా కార్యక్రమాలు చేపట్టి, తద్వారా మానసిక సంతోషాన్ని పొందుతున్నట్టు చెబుతున్నారు. మండల కేంద్రమైన కడియం గ్రామానికి చెందిన గానుగుల సీతారత్నం (90) అనే వృద్ధురాలు నడవలేని పరిస్థితిలో ఉండడంతో, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తాడాల విష్ణు చక్రవర్తి ఖర్చుకు వెనకాడకుండా సౌకర్యవంతమైన వీల్ చైర్ ను కొనుగోలు చేసి, ఆ వృద్ధురాలు ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల మధ్య ఆమెకు అందజేశారు. వీల్ చైర్ తో పాటు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కొంత నగదు మరియు కొత్త బట్టలను అందజేశారు. తన బాధను అర్థం చేసుకుని, వీల్ చైర్ సమకూర్చడంతో  ఆ వృద్దురాలి కళ్ళల్లో కృతజ్ఞత, ఆనందం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో చిలుకూరి రామకృష్ణ, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు