Monday, May 6, 2024
Monday, May 6, 2024

వచ్చే సెప్టెంబరు లేదా అక్టోబరులో థర్డ్‌వేవ్‌..


ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డా. రణదీప్‌ గులేరియా
వచ్చే సెప్టెంబరు లేదా అక్టోబరులో దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ తలెత్తే అవకాశం ఉందని దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డా. రణదీప్‌ గులేరియా తెలిపారు. ఇది సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే మరీ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఐసీఎంఆర్‌ నాలుగో జాతీయ కొవిడ్‌ సీరో సర్వేలో ఇది తేలిందని చెప్పారు. థర్డ్‌ వేవ్‌ లో పిల్లలపై దీని ప్రభావం అంతగా ఉండదని అభిప్రాయపడ్డారు. పిల్లల్లో 50 నుంచి 60 శాతం యాంటీ బాడీలు పెరిగాయని తాజా అధ్యయనంలో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. వీరికి కొవాగ్జిన్‌, జైడస్‌ క్యాడిలా టీకామందులు బాగా పని చేస్తాయన్నారు. జైడస్‌ క్యాడిలా టీకామందు సెప్టెంబరు నుంచి అందుబాటులోకి వస్తుందని రణదీప్‌ గులేరియా ప్రకటించారు. వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్‌ అనివార్యమని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img