Wednesday, December 18, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజైలును సంస్కృతి మార్పుకు కేంద్రంగా మార్చండి.. భగవాన్ భాయ్

జైలును సంస్కృతి మార్పుకు కేంద్రంగా మార్చండి.. భగవాన్ భాయ్

విశాలాంధ్ర ధర్మవరం:: జైలును సంస్కృతి మార్పుకు కేంద్రంగా మార్చాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమార్ భగవాన్ భాయ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సబ్ జైల్లో రాజస్థాన్లోని మౌంట్ అబూ నుండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం నుండి బ్రహ్మకుమారు భగవాన్ భాయి ఆధ్యాత్మిక పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది జైలు కాదు అని సంస్కరణోద్యమము అని,మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఇందులో మీరు ఉండడం జరిగిందని తెలిపారు. పగ తీర్చుకునే బదులు మనల్ని మనం మార్చుకోవాలని తెలిపారు. జీవితములో ఎప్పుడూ కూడా మంచి, దృఢమైన సంకల్పం, ఇతరులకు సేవ చేయడం లాంటి కార్యక్రమాలే శాశ్వతం అని తెలిపారు. మీ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మంచి జీవితాన్ని గడుపుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి, దయ, క్షమాపణ, ఇతరులకు సేవ చేయడం, ఇతరులను ఆదుకోవడం లాంటి కు అలవాటు పడాలని తెలిపారు. మనం మంచి వాటికే అలవాటు పడాలని చెడును పూర్తిగా తొలగించాలని తెలిపారు. మనిషిలోని దుర్గుణాలు దుర్మార్గాలు మనల్ని పేదలుగా మార్చుతాయని తెలిపారు. జీవితంలో సద్గుణాలు లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. మానవ జీవితం ఎంతో విలువైనదని తెలిపారు. జీవితములో పనికిరాని పనులు చేసి తమ జీవితాన్ని వృధా చేయకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవితములో మంచి మార్పు తీసుకుని రావడానికి మాత్రమే ప్రయత్నం చేయాలని తెలిపారు. ప్రతి మనిషిలో కామం, క్రోదం,లోపం,అనుబంధం, అహంకారం, అసూయ, ద్వేషం మొదలైన చెడులను మన జీవితము నుండి తరిమి కొట్టాలని తెలిపారు. ఖైదీలుగా మీరందరూ కూడా గతాన్ని మరిచిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించాలని తెలిపారు. మీ కుటుంబం కోసం బ్రతకాల్సిన అవసరం ఇప్పుడు ఉందని తెలిపారు. మానవజన్మ మంచి పనులు చేయడానికి మాత్రమే మనము ఉన్నామని చెడు పనులు ఎటువంటి పరిస్థితుల్లో చేయరాదని తెలిపారు. అనంతరం సబ్ జైలు సూపర్డెంట్ బ్రహ్మారెడ్డి ఇటువంటి కార్యక్రమాలకు మా సభ్యులకు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలుపుతూ, మా ఖైదీలలో మంచి మార్పు తీసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని తెలుపుతూ ప్రత్యేకంగా ప్రజాపిత బ్రహ్మకుమారి సంఘమునకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రాజయోగ సేవ కేంద్రం కోఆర్డినేటర్ రాధా మెహందీ, జైలు సిబ్బంది శివరామకృష్ణ, శివ నాగేశ్వర్, శ్రీనివాసులు బాయి, సుధాకర్ బాయ్, బి కే క్రాంతి భాయ్, బి కే రాజు భాయ్, అశోక్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు