Homeఆంధ్రప్రదేశ్క్లీన్ అండ్ గ్రీన్

క్లీన్ అండ్ గ్రీన్

- Advertisement -

క్లీన్ అండ్ గ్రీన్ పై శిక్షణా కార్యక్రమం.

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం జేగురుపాడు గ్రామంలో శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని శుభ్రపరచడం ఎలా అనే అంశంపై రూపొందించబడిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, క్లాప్ మిత్ర, షెడ్డు మిత్ర లు పాల్గొన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్ర వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంటింట చెత్త సేకరణ, గ్రామ శివార్లలో అధికంగా ఉండే చెత్తపోగులు తొలగించడం వంటి వాటిపై సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం అందరూ కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడివొ నల్లం శ్రీనివాస్, గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శిలు అయినవిల్లి శ్రీనివాసరావు, రూప్ చంద్, శ్రీనివాస్ రెడ్డి, రావిపాటి సత్యనారాయణ, తాతారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు