తేదేపా ఎస్.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ…
విశాలాంధ్ర ఏలూరు:టిడిపి సభ్యత్వ నమోదులో 3వ డివిజన్ 2061 సభ్యత్వాలు నమోదు చేసి అన్ని డివిజన్ ల కంటే అగ్ర భాగాన ఉండి సరికొత్త రికార్డు సృష్టించిందని తేదేపా ఎస్.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ తెలిపారు.బుధవారం స్థానిక మూడవ డివిజన్ లో సభ్యత్వ నమోదులో బాలాజీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నెలలో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటికీ 2061 సభ్యత్వాలు నమోదు చేసి నగరంలోనే ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు.ఈ సభ్యత్వ నమోదుతో స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) నేతృత్వంలో బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని తెలిపారు.డివిజన్లో ప్రతి నలుగురులో ఒకరు తెలుగుదేశం సభ్యత్వం పొందే పరిస్థితి తీసుకు వస్తామన్నారు. టిడిపి కార్యకర్తలకు సంక్షేమం అందించడంతోపాటు రాజకీయంగా,ఆర్థికంగా ఎదిగేందుకు పూర్తిస్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాలు ప్రాధాన్యత క్రమంలో అందించడం ద్వారా ఆర్థికంగా పేదలు నిలదొక్కుకునే విధంగా కృషి చేస్తామని ప్రకటించారు. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా కార్యకర్తల తలసరి ఆదాయం పెరిగే విధంగా బడేటి చంటి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.దీనికోసం డివిజన్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు.ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కోఆప్షన్స్ సభ్యురాలు జాలా సుమతి బాలాజీ,బొట్టేటి మహేష్ లను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 3వ డివిజన్ అధ్యక్షులు చనపతి వెంకటరమణ,ఇంకుల రూపేష్, జాలా శివశంకర్, గాలి త్రిమూర్తులు, వీరబత్తిన వనిత, మర్రి ఏసు,షేక్ రిజ్వానా, సుల్తానా బేగం, పొందూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు.