Homeజిల్లాలుకర్నూలుచిన్నకడబూరులో రైతన్న మీ కోసం

చిన్నకడబూరులో రైతన్న మీ కోసం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు ( కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో శుక్రవారం రైతన్నా మీ కోసం కార్యక్రమం టీడీపీ నాయకులు దశరథరాముడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వారు సందర్భంగా ఇంటికి వెళ్లి 17 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం పార్టీలు కులాలు చూసి పథకాల అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సైతం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వల్ప కాల వ్యవధిలోనే చేతికొచ్చే పంటలను వేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు వేలకోట్లు నిధులు కేటాయించిందని తెలిపారు .రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది శ్రీనివాసులు, నాయకులు, లక్ష్మన్న, డోలు రామాంజనేయులు, కలుగొట్ల రామాంజనేయులు, కలుగొట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు