విశాలాంధ్ర- ధర్మవరం:: మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామంలో మినీ గోకులాన్ని ఉపాధి హామీ ఏపిడి వెంకటాచలపతి ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులతో పాడి రైతుల అభివృద్ధి కొరకు మినీ గోకులాలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, మంజూరైన రైతులు త్వరితగతిన పూర్తి చేసుకుంటే సకాలంలో నిర్మాణ బిల్లులు తప్పక వేయడం జరుగుతుందని తెలిపారు. చిగిచెర్ల గ్రామములోని నారాయణస్వామి అనే పాడి రైతుకు చెందిన నిర్మాణ దశలో ఉన్న మినీ గోకులాన్ని వారు పరిశీలించారు. రైతులకు భారం కాకుండా బిల్లులు కూడా సకాలంలో పంపించే బాధ్యత తనది అని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద మంజూరైన మామిడి మొక్కలను కూడా వారు పరిశీలించారు. పండ్ల తోటలను బాగా కాపాడుకోవాలని రైతులకు ఆర్థిక అభివృద్ధి కూడా చెందాలని తెలిపారు. కూలీలు చేస్తున్న ఫారంపౌండ్ పనులు కూడా పరిశీలించి కొలతలకు అనుగుణంగా పనిచేస్తే పూర్తిగా కూలివేతనం లభిస్తుందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ సూపర్వైజర్ శంకర్, టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్ ,ఫీల్డ్ అసిస్టెంట్ హేమంత్, తదితరులు ఉన్నారు.
మినీ గో కులాన్ని పరిశీలించిన ఉపాధి హామీ ఏపీ డి వెంకట చలపతి
RELATED ARTICLES