Homeఆంధ్రప్రదేశ్యధాతధంగా జిల్లాలో ‘మీకోసం

యధాతధంగా జిల్లాలో ‘మీకోసం

- Advertisement -

డిసెంబర్ 1 సోమవారం యధాతధంగా జిల్లాలో ‘మీకోసం’ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక

— కలెక్టర్ కీర్తి చేకూరి

విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు డిసెంబర్ 1వ తేదీ సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ/వార్డు సచివాలయ స్థాయిల్లో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం’’ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు తమ వినతిపత్రాలను ముందుగానే ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే, అర్జీల స్థితి తెలుసుకోవడానికి పౌరులు 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాత సహాయకుల ఏర్పాటు, రిసెప్షన్ డెస్క్, జిల్లా–మున్సిపల్–మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. వికలాంగులకు అనుకూల సౌకర్యాలు, తాగునీరు వంటి వసతులు సిద్ధం చేయాలని, సిఎమ్‌వో రిపోర్టులు సమయానికి పంపాలని జిల్లా మీకోసం నోడల్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. అలాగే, పౌర సేవలు మరింత మెరుగుపడేందుకు వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009 సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు