Saturday, December 21, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాణ్యమైన వస్తు సేవలను మాత్రమే కొనుగోలు చేయాలి.. ఆర్డీవో మహేష్

నాణ్యమైన వస్తు సేవలను మాత్రమే కొనుగోలు చేయాలి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం;! నాణ్యమైన వస్తు సేవలలు మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ను ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, వినియోగదారుల సంఘం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్, ప్రిన్సిపాల్, విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు కలిసి పట్టణములో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ మహేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆర్డిఓ ఆధ్వర్యంలో విద్యార్థులచే, అధ్యాపకులచే, ఉపాధ్యాయులచే వినియోగదారుల ప్రతిజ్ఞను చేయించడం జరిగిందన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ను స్ఫూర్తిగా, లక్ష్యంగా తీసుకొని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. వినియోగదారుల చట్టం యొక్క హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని,తగిన న్యాయం పొందాలని తెలిపారు. అక్రమ వ్యాపార విధానా లలో బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. మోసపూరిత ప్రకటనలు ప్రభావితం కారాదని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు పొందాలని, ఎమ్మార్పీ ధర కన్నా అధిక బిల్లు చెల్లించరాదని, కొనుగోలు సమయములో నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత కూడిన ధరలు ఉండాలని తెలిపారు. వస్తువు యొక్క కొనుగోలు విషయంలో రాజీ పడకూడదని, కొనుగోలు విషయంలో మోసం జరిగితే అడిగే అధికార హక్కు ఉందని తెలిపారు. అవసరమైతే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. వినియోగదారుల చట్టంపై సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు అవగాహన చేసుకున్నప్పుడే, ఎటువంటి అన్యాయం జరగదని, ఖచ్చితమైన న్యాయం అందరూ పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ డి టి లక్ష్మీదేవి, ధర్మవరం తాసిల్దార్ సురేష్ బాబు, వినియోగదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్ ,ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, అధ్యాపకులు శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున, కరుణాసాగర్, రాజేశ్వర రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కుల్లయిరెడ్డి,ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శైలజ, ఉపాధ్యాయులు వేణుగోపాలాచార్యులు, నౌరా, పట్టణ వినియోగదారుల సంఘం అధ్యక్షులు కుల్లాయప్ప కోశాధికారి రవీంద్ర గౌరవ అధ్యక్షులు గోవిందు సభ్యులు సుభాన్, నారాయణమ్మ, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు