జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రిషి విద్యాలయ పాఠశాలలో ఒక వారం పాటు గణిత కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా గణిత క్విజ్, గుణకార పట్టికలు, గణిత సమస్యలు, వివిధ గణిత పోటీలు విద్యార్థులకు నిర్వహించబడినవి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి, రెండవ, మూడవ బహుమతులను డీన్ భాస్కర్ సర్, ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్, రవీంద్ర సర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణిత విద్య ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించిందని పాఠశాల సిబ్బంది తెలిపారు.


