Friday, December 20, 2024
Homeజిల్లాలుఅనంతపురంవైజాగ్ వైపు నుండి వచ్చే రైళ్లను, బస్సులను, ప్రైవేటు వాహనాలను తరచూ తనిఖీలు చేపట్టాలి

వైజాగ్ వైపు నుండి వచ్చే రైళ్లను, బస్సులను, ప్రైవేటు వాహనాలను తరచూ తనిఖీలు చేపట్టాలి

మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు  చేపట్టాలి

శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి)
విశాలాంధ్ర – అనంతపురం : వైజాగ్ వైపు నుండి వచ్చే రైళ్లను, బస్సులను, ప్రైవేటు వాహనాలను తరచూ తనిఖీలు చేపట్టాలని, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో చేపట్టాలని శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) ఆదేశించారు.
శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని అడిషనల్ ఎస్పీ డివి.రమణమూర్తితో కలిసి శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) మాట్లాడుతూ… వైజాగ్ వైపు నుండి వచ్చే రైళ్లను, బస్సులను, ప్రైవేటు వాహనాలను తరచూ తనిఖీలు చేపట్టాలని, జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా ప్రతి పాఠశాల, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు  )ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో పిల్లల తల్లిదండ్రులు, ఇతర శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు పోలీస్ శాఖ వారితో కలిసి సమన్వయంతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, పంటల సాగు నందు గంజాయి సాగు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులకు సూచించారు. అనంతపురంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పూర్తి స్థాయి డి-అడిక్షన్ వార్డుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అడిషనల్ ఎస్పీ డివి.రమణమూర్తి మాట్లాడుతూ.. గత సమావేశం తర్వాత నవంబర్ 16 నుండి డిసెంబర్ 19 వరకు ఒక కేసు నమోదయిందని, నలుగురు నిందితులలో ముగ్గురిని రిమాండ్ కు పంపామని   వారి నుండి 1.521 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ముమ్మరంగా జరుపుతున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మాలోల, అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి  సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, హార్టికల్చర్ డిడి నరసింహారావు, ఐసిడిఎస్ పీడీ వనజా అక్కమ్మ, డిటిసి వీర్రాజు, సాంఘిక సంక్షేమ శాఖ జెడి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు, డిఈఓ ప్రసాద్ బాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్చార్జి డిడి సుభాషిని, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రైల్వే, అటవీ శాఖ, ఇంటర్మీడియట్ బోర్డ్, వైద్య ఆరోగ్యశాఖ, పాలిటెక్నిక్, జేఎన్టీయూ అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు