విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న డిగ్రీ విద్యార్థిని జీవితకు సహాయం చేయాలనే ఉద్దేశంతో “హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ జీవిత” కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా విద్యార్థులు కలిసి రూ.50,000 విరాళాన్ని సేకరించి పాఠశాల ప్రాంగణంలో జీవిత తల్లిదండ్రులకు అందజేశారు.ఈ సేవా కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ రిజ్వాన్ బాషా ప్రధాన ప్రేరణగా నిలిచారు. అలాగే కరస్పాండెంట్ షేకున్ మేడం, వైస్ ప్రిన్సిపాల్ రమణ , పాఠశాల సిబ్బంది అందరూ విరాళాలు అందించడంతో పాటు నిత్యావసర సరుకులు కూడా జీవిత కుటుంబానికి అందించారు. ఈ సహాయంతో జీవిత తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
డిగ్రీ విద్యార్థిని జీవితకు ఆర్థిక సహాయం
- Advertisement -
RELATED ARTICLES


