Sunday, December 22, 2024
Homeజిల్లాలుఅనంతపురంతుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణకు 500 కోట్లు మంజూరు చేయాలి

తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణకు 500 కోట్లు మంజూరు చేయాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్

విశాలాంధ్ర- అనంతపురం : అనంత, సత్యసాయి జిల్లాల్లో ఉపయోగపడే తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణకు వెంటనే రూ.500 కోట్లు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, జిల్లా కార్యదర్శి సి. జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శులు పి నారాయణస్వామి, సి. మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి. జగదీష్ మాట్లాడుతూ… సత్య సాయి అనంత జిల్లాలో ఉపయోగపడుతున్న తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికరణ కోసం ఇంతవరకు కూటమి ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. ఆధునికరణ చేయడానికి 500 కోట్లు కావాల్సి ఉందన్నారు. ఆధునికరణ చేయడం వలన 30 టీఎంసీల నీళ్లు వస్తుంది అని దాని ద్వారా కర్నూలు, అనంతపూర్,కడప జిల్లాల్లో తుంగభద్ర జలాలు పంపడానికి సాధ్యమవుతుందన్నారు. దీనివలన చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందన్నారు. దీనికి 36 కోట్లు ఇవ్వడం వలన కాంట్రాక్టు జోబు నింపడానికే తప్ప పూర్తిస్థాయిలో ఆధునికరణ చేయడానికి ఏమాత్రం ఉపయోగపడదు అన్నారు. కరువు ప్రాంతమైన అనంత, సత్యసాయి జిల్లాల్లో ప్రతి ఏడాది తక్కువ వర్షపాతంతో రైతుల నష్టపోతున్నారన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులపై ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అనంత సత్యసాయి జిల్లాల ప్రాజెక్టుపై ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో ముఖ్యమైన నాయకులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు, చంద్రబాబుతో చర్చించి ఆధునీకరణ కోసం 500 కోట్లు విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. హంద్రీనీవా కాలువ ఆధునీకరణ చేసే నేపథ్యంలో అంతా కూడా కాంక్రీట్ వేయడం పూనుకోవడంవల్లన భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి అన్నారు. సెకండ్ ఫేస్ వర్క్ లో కాంక్రీట్ వేయకుండా నిలిపివేయాలని దీనివలన భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతుందన్నారు. రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు అందించి కాల్వ అభివృద్ధి చేయాలన్నారు. మూడు లక్షల 50 వేలు ఎకరాలకు హెచ్ఎసి కాల్వ ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరు అందించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి సిపిఐ, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… విజయవాడలో జరిగిన సిపిఐ కార్యవర్గ సమావేశంలో ప్రధానాంశంగా ఇంటి పట్టాలకు సంబంధించి గత ప్రభుత్వం 32 లక్షల మంది ఇంటి స్థలాలు నివాసానికి యోగ్యంలేని గుట్టలు వంకలు, వాగులు మధ్యలో పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. టిడిపి ప్రభుత్వం ద్వారా గ్రామీణ స్థాయిలో నివాసం ఉన్నవారికి మూడు సెంట్లు, పట్టణంలో ఉండే వారికి రెండు సెంట్లు ఇస్తూ ఇల్లు నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. గత ప్రభుత్వం జగన్ ఆదానితో ఉన్నటువంటి ఒప్పందం సెగి ద్వారా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ రద్దు చేయాలన్నారు. 25 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకోవడంతో ఒక లక్ష యాభై ఆరు కోట్ల ప్రజలపై భారం పడుతుందన్నారు. ప్రస్తుతం కరెంట్ బిల్లులో అనేక చార్జీలు కలుపుతూ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు కరెంటు చార్జీలు తగ్గించాలని గ్రామ సచివాలయాలు, మండల ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో స్థాపించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాలు సందర్భంగా దేశవ్యాప్తంగా 100 సంవత్సరాల శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని సిపిఐ పార్టీ నిర్ణయించడం జరిగిందన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు. డిసెంబర్ 26వ తేదీన అన్ని ప్రాంతాలలో సిపిఐ జెండా ఆవిష్కరణ చేసి ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, నగర కార్యదర్శి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు