Thursday, January 2, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి

ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి

అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర అనంతపురం : ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం అనంతపురం నగరంలోని ఫస్ట్ రోడ్, శివాలయంలోని ధ్యాన మందిరంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారత దేశ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, ధ్యానం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్నారు. ధ్యాన విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, చిన్నతనం నుంచే పిల్లలకు కూడా అలవాటు చేయాలని, మనసును, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు 1 గంటైనా ధ్యానం కోసం కేటాయించాలని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనశ్శాంతి కనిపించడం లేదని, ధ్యానం వలన అనేక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యం బాగుంటుందని, సర్వరోగ నివారణగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్ నెస్ సమస్త డాక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉండి, మనిషి ఆరోగ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి, వివేకానంద యోగా కేంద్రాల గౌరవ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మ విశ్వకుమారి సమస్త ప్రతినిధులు శారద, వివేకానంద యోగా కేంద్రం అర్ట్స్ కళాశాల సెంటర్ ఆంజనేయులు, హార్ట్ ఫుల్ నెస్ సంస్థ, పతంజలి యోగ సమితి, సత్యసాయి ధ్యాన మండలి, శ్రీ రామ కృష్ణ సేవా సమితి, ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం, ఆర్ట్ ఆప్ లివింగ్ ఈషా ఫౌండేషన్, ధ్యాన సంస్థ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్ ప్రాణాయామ మరియు ధ్యానం చేయించారు. దివాకర్, ఆంజనేయులు, పుల్లయ్య, తారక్, శ్రీనివాసులు శెట్టి, చెన్నకేశవులు, రవి, శ్రీధర మూర్తి, ఇషా రవి మొదలగు అనేకమంది కార్యక్రమంలో పాల్గొని యోగ విశిష్టతను, నేటి సమాజ అవసరమని అనేక విషయాలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు