తహశీల్దార్ బి. సుదర్శన రావు
విశాలాంధ్ర – నెల్లిమర్ల : ప్రజలకు, రైతులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ బి. సుదర్శనరావు పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని వల్లూరు, పెదతరిమి గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన భూ సంబంధ సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని. అవి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతోంద న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐపి.వేణుగోపాల్
ఎం ఎస్ దివ్య మానస, ఆర్ ఎస్ డి టి సత్యనారాయణ, వి ఆర్ ఓ గోవిందరావు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు .