అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలపై అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు . ట్రంప్ నిర్ణయాలకు ప్రజల మద్దతు భారీగా తగ్గింది. రాయిటర్స్-ఇప్సాస్ నిర్వహించిన పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. వలసలపై ఆయన తీసుకుంటున్న కఠినచర్యలు చాలాదూరం వెళ్లాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ట్రంప్ యంత్రాంగం ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించింది. దీనికి నిరసనగా జరిగిన ఘర్షణల్లో ఆ ఏజెంట్ల చేతిలో శనివారం మినియాపొలిస్‌లో మరో అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు ముందు, తర్వాత అంటే శుక్రవారం నుంచి ఆదివారం మధ్య ఈ పోల్ చేపట్టగా.. ట్రంప్ నిర్ణయాలను ఆమోదించేవారి సంఖ్య తగ్గిపోయింది. తాజాగా 39 శాతం మంది ఆమోదించగా.. అంతకుముందు ఆ రేటు 41 శాతంగా ఉంది. 53 శాతం మంది ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వలసలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేశారు. ఈ విషయంలో తొలుత ఆయనకు ప్రజల నుంచి భారీ ఆమోదం లభించింది.
ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలపై అసంతృప్తి
- Advertisement -
RELATED ARTICLES


