Thursday, December 26, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్వచ్ఛ ధర్మవరమే"లక్ష్యం….

స్వచ్ఛ ధర్మవరమే”లక్ష్యం….

మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం మున్సిపాలిటీ ప్రాంతాన్నిఅతి సుందరంగా తీర్చి దిద్దడమే తమ లక్ష్యం అని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం ధర్మవరం మండలంలోని తుమ్మలపల్లి – గ్రామంలో సుమారు రూ . 2 కోట్ల 23 లక్షలతో నూతన నూతనంగా డంప్ యార్డ్ నిర్మాణానికి సంబంధించి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ధర్మవరం పురపాలక సంఘం సంబంధించిన వర్మి కంపోస్టు గత 8 సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉందని ప్రస్తుతం మరమ్మత్తుల పనులు పూర్తిచేసి నేడు పునః ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. తద్వారా పురపాలక సంఘానికి ఒక సంవత్సర కాలంలో 90 రోజులకు 40 టన్నుల దాకా సేంద్రియ ఎరువు తయారుతోపాటు ఒక సంవత్సర కాలానికి రూ.14 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ధర్మవరం పట్టణంలో ఒక రోజుకు 73 టన్నులు చెత్త ఉత్పత్తి జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. అలాగే వ్యక్తపదార్థాల సేకరణ కేంద్రం (ఎంఆర్ఎఫ్) ద్వారా తడి , పొడి చెత్తలను వేరు చేయడం జరుగుతుందన్నారు. ధర్మవరం ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతమని స్వచ్ఛ ధర్మవరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజలు విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉదార భావం కలిగిన వారందరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. సమిష్టి కృషితో ధర్మవరం పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. చెత్త నుండి సంపద సృష్టించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు పురపాలక సంఘం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పరిశుద్ధ నీటి కారణంగా, దోమల వల్ల డేంగి డయోరియా, మలేరియా తదితర విష జ్వరాల బారిన పడకుండా ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం నీటి ట్యాంకులను శుభ్రం కూడా చేయలేకపోయిందని 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిందని వారు విమర్శించారు. రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువులు అందించే క్రమంలో ఆ చెత్త నుంచే సంపద సృష్టించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్ర ,రాష్ట్ర పథకాల ప్రజలు అవగాహన కలిగి అర్హులందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జన వికాస్ యోజన, అమృత్ తదితర పథకాల అమలు అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగ ,సిబ్బంది సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పురపాలక సంఘం అధికారులు కాలువల్లో మురికి నీరు , రోడ్లపై చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు
ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, రాష్ట్ర జనసేన నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ర్ ప్రమోద్ కుమార్ , తదితరులు పాల్గొని ప్రసంగించారు.

మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి.

ధర్మవరం పురపాలక సంఘం కార్యాలయంలో బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కా చర్ల శ్రీలక్ష్మి తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజెండా మేరకు ధర్మవరం పురపాలక సంఘం 20 24-25 సంవత్సరంలకు సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాలు , 2025-26 సంవత్సరమునకు తయారు చేయబడిన బడ్జెట్ అంచనాలు మంత్రి మరియు కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో ఆమోదించారు.
20 24 – 25 సవరణ బడ్జెట్ రూ. 4, 98, 27, 6 0 6 కాగా
20 25 – 26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూ. 41,00000 మిగులు బడ్జెట్ కాగా, 2025 – 26 సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ రాబడి వసూళ్లు రూ. 49, 32, 55, 287 అలాగే మూలధన వసూళ్లు రూ. 26, 60, 00000 లు, రాబడి ఖర్చు రూ. 45, 15, 92, 410 లు, మూలధన ఖర్చులు రూ. 30, 35, 62, 8 7 7 లను సమావేశంలో ఆమోదించారు.
పలువురు వార్డ్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ , మేనేజర్ రాజేశ్వరి బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు